మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో వుంది. ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపథ్యంలో సుశాంత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ చాలా జోరుగా వున్నట్లుగా వుంది ? నేను ఇనింగ్స్ అలా ఏం అనుకోలేదు. నేను మాములుగా ఆడేది టెస్ట్ మ్యాచ్( నవ్వుతూ). ఏదీ ప్లాన్ చేసింది కాదు. హీరో, గెస్ట్ రోల్, సపోర్టింగ్ ఇలా అన్నీ నాకు…