‘మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని సినీ రంగంలోకి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో దిల్ రాజు గారు ‘లోర్వెన్ AI’ స్టూడియోని లాంచ్ చేయడం అభినందనీయం. ‘లోర్వెన్ AI’ స్టూడియో ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’అన్నారు తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘లోర్వెన్ AI’ స్టూడియోని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కి తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు హాజరైన ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది. ‘లోర్వెన్ AI’ స్టూడియో లాంచ్ ఈవెంట్ లో తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ డి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా…