తొలిచిత్రంతో ‘ఆర్య’తోనే దర్శకుడు తన ప్రతిభను నిరూపించుకున్న దర్శకుడు సుకుమార్. ఆ తరువాత జగడం, ఆర్య-2, 100 పర్సెంట్ లవ్, వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో చిత్రాలతో బ్రిలియంట్ దర్శకుడుగా పేరు పొందిన సుకుమార్, రంగస్థలం వంటి చిత్రంతో కమర్షియల్ కల్ట్ బ్లాక్‌బస్టర్‌తో అందరినీ నివ్వెరపరిచాడు. ఇక ‘పుష్ప’తో పాన్ ఇండియా సక్సెస్‌ను సాధించిన సుకుమార్ ‘పుష్ప-2’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప-2’ చరిత్రను సృష్టించింది. తొలిచిత్రం ఆర్య నుంచి కొత్తదనం కోసం తపనపడుతూ, ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్ పీరియన్స్ అందించే సినిమాలు రూపొందిస్తూ తనకంటూ ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నాడు, ముఖ్యంగా బాలీవుడ్‌లో పెద్ద స్టార్స్ సైతం సుకుమార్‌తో సినిమాలు తీయడానికి ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. ఇలాంటి ఓ గొప్ప క్రియేటివ్ దర్శకుడికి నేడు బీఎన్…