ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటన సమర్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఆవేదనలో అర్ధం ఉంది! నిజం ఉంది. ఆ నలుగురిలో నేను లేను, ఎప్పుడో తప్పుకున్నాను. నన్ను ఇందులో కలపకండి. ఆ నలుగురి వ్యాపారం లోంచి బయటకు వచ్చేసాను. తెలంగాణ లో ఒక్క థియేటర్ కూడా నాకు లేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా తగ్గించుకుంటూ వచ్చాను. 1500 థియేటర్లలో ఇప్పుడు 15 కూడా లేవు. ఎవరైనా రెన్యూవల్ చేస్తానన్నా వద్దంటున్నాను. లీజుకు మాత్రమే ఒప్పుకుంటున్నాను. 50 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీ నిర్మాత గా వున్నాను. సినిమాలు తీయడమే నా వృత్తి. పవన్ సినిమా ముందు థియేటర్లు మూసి వేస్తాననడం దుస్సాహసం. థియేటర్ల సమస్యకు సంబంధించి మూడు మీటింగులు జరిగితే ఒక్క సమావేశంలోనూ నేను పాల్గొనలేదు. ఇండస్ట్రీ కష్టంలో వున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్.జగన్…