ఆంట్స్ టు ఎలిపెంట్స్ సినిమాస్ కో ప్రొడక్షన్ పై మోజ్విత్ అండ్ చరణ్ తేజ్ సమర్పణలో వస్తున్నమంచి ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్రెండ్ షిప్ స్టోరీ ‘హలో జూన్’. ప్రస్తుతం అన్ని హంగులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా నిర్మాతలు అనిల్ రెడ్డి.ఎం, జయప్రకాశ్ వి. చిత్రానికి సంబంధించిన విశేషాలను వివరిస్తూ ..”ఒక మంచి చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళంలో కూడా విడుదల చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం ఒక ఫీల్ గుడ్ మూవీ. ఒక అమ్మాయి జీవితంలో డ్రీమ్స్ ఎలా ఉంటాయో అన్నది ప్రధానంగా సాగుతూ ఆద్యంతం ఆసక్తికరంగా వినోదాన్ని పంచుతూనే ప్రేక్షకులను బాగా ఆలోచింపజేస్తుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ సినిమా ఓ అమ్మాయి జీవితంలో జరిగే టెన్ ఇయర్స్ ఫ్రెండ్ షిప్ అండ్ లవ్…