మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచీ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. హీరోయిన్ పూజాహెగ్డే బయటకు వెళ్లిపోయింది. తర్వాత తమన్ అవుట్ అన్నారు. కానీ తమన్ దానిపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాకు ఆయన పని చేస్తున్నాడు. మూడో వ్యక్తి కెమెరామెన్ పి.ఎస్ .వినోద్ 50 శాతం చిత్రీకరణ పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ వదిలి బయటకు వెళ్లారు. ప్రస్తుతం ఆ స్థానంలో మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘గుంటూరు కారం’ చిత్రం అవకాశం ఎలా వచ్చిందో తెలిపారు. ’’ఇన్నేళ్ల జర్నీల్లో అందరు హీరోలతో కలిసి చేస్తున్నావ్. మహేశ్ బాబు సినిమాకు ఎందుకు పనిచేయట్లేదు’ అని సన్నిహితులు అడిగేవారు. అయితే ఈ చిత్రం నేను చేయడంతో వారందరికీ జవాబు దొరికినట్టే. కెమెరా గురించి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తితో పనిచేయడం ఆనందంగా…