మహాకాల్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మాణంలో శ్రీ విద్యా బసవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హత్య’. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 24న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సోమవారం నాడు మీడియా ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో.. దర్శకురాలు శ్రీవిద్య బసవ మాట్లాడుతూ.. ‘‘మధ’ చిత్రానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. కరోనా వల్ల ఆ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేసుకోలేకపోయాను. ప్రశాంత్ వల్ల ఈ హత్య చిత్రం ఈ స్థాయికి వచ్చింది. పెట్టే ప్రతీ పైసాకి బాధ్యత వహించాలని చాలా జాగ్రత్తగా సినిమాను తీశాం. లాభసాటి ప్రాజెక్టుగా హత్యను మల్చాలని అనుకున్నాను. హత్య షూటింగ్ టైంలో మేం చాలా కష్టాల్ని ఎదుర్కొన్నాం.…