Happy Birthday : శ‌ర‌ణ్ కుమార్‌ : టాలీవుడ్ కు మ‌ల్టీటాలెంటేడ్ హీరో!

Happy Birthday

సూప‌ర్ స్టార్ ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీకి ఓ సూప‌ర్ టాలెంట్ దూసుకొచ్చింది. మ‌ల్టీటాలెంట్‌తో అద‌ర‌గొడుతోంది. న‌టుడిగా, మోడ‌ల్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా, బహుభాషావేత్తగా ప్ర‌తిభ చూపిస్తూనే.. కరాటే, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్.. ఇలా వేర్వేరు రంగ‌ల్లోనూ ఓ వెలుగు వెలుగుతోంది. ఆ యంగ్ టాలెంట్ పేరు శరణ్ కుమార్. జ‌న్మ‌దినం జ‌రుపుకుంటున్న శ‌ర‌ణ్ కుమార్‌కు శుభాకాంక్ష‌లు అందిస్తూ ఆయ‌న లైఫ్ జ‌ర్నీ తెలుసుకుందాం. శరణ్ కుమార్ సినీఇండ‌స్ట్రీకి చెందిన కుటుంబంలో 1997 సెప్టెంబరు 4 న జన్మించాడు. ఇండస్ట్రీ లెజెండ్స్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ గ్ర‌హీత‌ దివంగత విజయ నిర్మల, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సూపర్ స్టార్ కృష్ణ ప్రభావంతో పెరిగారు. చాలా చిన్న వయసులోనే ఓ వైపు తన చదువును కొన‌సాగిస్తూ మ‌రోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. శరణ్ కుమార్ స్కూల్ సమయంలోనే సాంస్కృతిక…