స్కూల్‌ డేస్‌ గుర్తు చేసే ‘గాంగ్స్‌ ఆఫ్‌ 18’ : నిర్మాత గుదిబండి వెంకట సాంబిరెడ్డి

gudibanda venkata sambireddy producer

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు విద్యాసంస్థలు నిర్వహిస్తోన్న గుదిబండి వెంకట సాంబి రెడ్డి నిర్మాతగా మారి శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్‌ బేనర్‌ స్థాపించి తొలిసారిగా అలీ హీరోగా ‘పండుగాడి ఫొటోస్టూడియో’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తర్వాత తాజాగా మలయాళంలో రూపొందిన ‘పడి నెట్టం పడి’ చిత్రాన్ని ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ 18’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. మమ్ముట్టి, ప్రియమణి, ఆర్య, పృథ్వీరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. శంకర్‌ రామకృష్ణన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఘన విజయం సాధించింది. ఈ నెల 26న తెలుగులో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గుదిబండి వెంకట సాంబి రెడ్డితో ఇంటర్వ్యూ విశేషాలు అయన మాటల్లోనే… కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు విద్యాసంస్థలు స్థాపించాను. సినిమా రంగంలోకి రావాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది.…