అను ప్రొడక్షన్స్ బ్యానర్ పై అనసూయ రెడ్డి నిర్మాణంలో జగ పెద్ది దర్శకత్వంలో విరాజ్ రెడ్డి చీలం, మిమీ లియానార్డ్ జంటగా తెరకెక్కిన సినిమా ‘గార్డ్’. రివెంజ్ ఫర్ లవ్ ట్యాగ్‌లైన్. శిల్పా బాలకృష్ణ కీలక పాత్ర పోషించింది. ఆస్ట్రేలియాలో తెరకెక్కించిన ఈ ‘గార్డ్’ సినిమా నేడు (ఫిబ్రవరి 28, 2025) విడుదల అయింది. ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం… కథ: ఈ చిత్రానికి సంబంధించిన కథంతా ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన సుశాంత్ (విరాజ్ రెడ్డి) సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ డాక్టర్ సామ్ (మిమీ లియానార్డ్)తో ప్రేమలో పడతాడు. సుశాంత్ పనిచేసే హాస్పిటల్ బేస్మెంట్ లో ఎప్పుడూ ఏదో అరుపులు వినిపిస్తూ ఉంటాయి. తనని కూడా అక్కడకు తీసుకెళ్లమని సామ్ అడగడంతో తీసుకెళ్తాడు. అనుకోకుండా సామ్ అక్కడ ఎవ్వరూ…