చైతన్య పసుపులేటి, హీనా రాయ్ జంటగా అశ్వద్ధామ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో డాక్టర్ సుశీల నిర్మిస్తున్న సినిమా GTA (గన్స్ ట్రాన్స్ యాక్షన్). విభిన్నమైన కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు దీపక్ సిద్ధాంత్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు ఆకాశ్ పూరీ, నందు హాజరయ్యారు. వీళ్ళ చేతుల మీదుగానే ట్రైలర్ విడుదలైంది. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. గ్యారీ బిహెచ్ ఎడిటర్. ప్రసాద్ బాపు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా.. త్వరలోనే విడుదల కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. దర్శకుడు దీపక్ సిద్ధాంత్ మాట్లాడుతూ.. ‘GTA (గన్స్ ట్రాన్స్ యాక్షన్) సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ…