దర్శకుల చేతుల మీదుగా జీఆర్ మహర్షి ‘మార్నింగ్ షో’ పుస్తకం ఆవిష్కరణ!

GR Maharishi's 'Morning Show' book was launched by the directors!

సినిమా అంటే చాలామందికి ఒక ఎమోషన్. చిన్నప్పటి నుంచీ చూసిన సినిమాల గురించి ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్పందిస్తూ ఉంటారు. కొందరు మాత్రమే ఆ స్పందనను రికార్డ్ చేస్తారు. అలా.. సుదీర్ఘ కాలంగా సినిమా జర్నలిస్ట్ గా తనకున్న అనుభవాలు, అనుభూతులతో పాటు చిన్నప్పటి నుంచీ తను చూసిన సినిమా విశేషాలు, సంగతులను గురించి విపులంగా వివరిస్తూ సీనియర్ జర్నలిస్ట్ జీఆర్ మహర్షి ‘మార్నింగ్ షో’ అనే పుస్తకాన్ని రాశారు. యాభై యేళ్లుగా తను చూసిన సినిమాలతో పాటు పరిశ్రమలోని మార్పులు, కథ, కథనాల్లో వచ్చిన మార్పులను గురించి ఆలోచనాత్మక విశ్లేషణతో ఆయన రచించిన ఈ పుస్తకాన్ని జమిలి సాహిత్య, సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో దర్శకుడు కుమారస్వామి(అక్షర) ప్రచురించారు. ఈ పుస్తకాన్ని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆత్మీయ అతిథులుగా హాజరైన…