ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. చాలా కాలంగా వాళ్లు ఎదురుచూస్తున్న ‘కల్కి 2898’ సినిమా విడుదలపై స్పష్టత వచ్చేసింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగానే.. కల్కి సినిమా రిలీజ్ విషయంలో మెగాస్టార్ సెంటిమెంట్ ను వాడేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చి సూపర్ హిట్ అయిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా రిలీజైన మే 9న కల్కి ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్బంగా కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ నెక్ట్స్ లెవల్లో ఉంది. ఆ లుక్ కల్కి సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ రిలీజ్ డేట్ ప్రమోషన్స్ కార్యక్రమాన్ని…