సినిమా టికెట్ రేట్ల విధానంపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెం120 అందరికీ ఆమోద యోగ్యంగా ఉంది. ఈ సందర్భంగా మా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరుపున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి, కేటీఆర్‌గారికి, సినిమాటోగ్రఫి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ (ఏషియన్ సునిల్). ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ – “చిన్న సినిమాలు 50 -150 రూపాయల వరకూ టికేట్ రేటుకి అమ్ముకోవచ్చు. నిర్మాతలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం అధిక దరలకు టికెట్లు విక్రయించకూడదు. ఈ రోజు కొన్ని థియేటర్స్‌లో టికెట్ రేట్లు ఎక్కువ రేటుకి అమ్మడం మా దృష్టికి వచ్చింది. మేం వెంటనే స్పందించి ఆ…