యువ సామ్రాట్ నాగ చైతన్య అక్కినేని, దర్శకుడు చందూ మొండేటి గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘తండేల్’ కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. నాగ చైతన్య కు హయ్యస్ట్ బడ్జెట్ చిత్రమైన ‘తండేల్’ ఈరోజు గ్రాండ్ ముహూర్తం వేడుకను జరుపుకుంది. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, పలువురు సినీ ప్రముఖులు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు నాగార్జున కెమెరా స్విచాన్ చేయగా, వెంకటేష్ క్లాప్ ఇచ్చారు. అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. మూవీ గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించి ఎప్పుడూ ప్రోత్సహిస్తున్న ప్రేక్షకదేవుళ్ళకు నమస్కారం. ఈ ప్రయత్నం ఏడాదిన్నరగా మొదలుపెట్టాం. ఈ రోజు సినిమా ప్రారంభోత్సవం జరగడం చాలా ఆనందంగా వుంది. మా…