మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు విద్యాధర్ తెరకెక్కించిన చిత్రం ‘గామి’. టాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి ఆసక్తి రేపి ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చిన చిత్రమిది. మరి ఈ సినిమా ట్రైలర్ తో క్రియేట్ చేసిన బజ్ ని అంచనాలు అందుకుందా అనేదితెలుసుకుందాం…. కథ : శంకర్(విశ్వక్ సేన్) మానవ స్పర్శని తట్టుకోలేని ఓ అఘోర. తనకి ఉన్న ఈ లోపం కారణంగా ఈ ప్రపంచంలో ఎక్కడా ఇమడ లేకపోతాడు. అయితే ఈ క్రమంలో తనకి ఉన్న లోపాన్ని నయం చేసే తారకా మాలిపత్రాలు ప్రతి 36ఏళ్ళకి ఒకసారి మాత్రమే ధ్రువనగిరి ప్రాంతంలో ఉంటాయని తెలుసుకుంటాడు. మరి అక్కడికి పయణమైన తన ప్రయాణంలో డాక్టర్ జాహ్నవి(చాందిని చౌదరి) తోడవుతుంది. అయితే ఇంకో పక్క శంకర్ ని కొందరి…