స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన చివరి పాట ఇదే.. పీఎన్ బీ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ డియర్ కృష్ణ. పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ కథను దినేష్ బాబు డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్న డియర్ కృష్ణ చిత్రంలో ప్రేమలు చిత్రం ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరితో పాటు ఐశ్వర్య కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. రియల్ ఇన్స్ డెంట్స్ ను ప్రేరణగా తీసుకొని పీఎన్ బలరామ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రాసుకున్నారు. హృదయాన్ని బరువెక్కించే ఓ విషాద సంఘటన, శ్రీకృష్ణున్నే భక్తులు ఆ భారం అంతా ఆయనపై వేశారు. డాక్టర్లే ఏం చేయలేమన్న పరిస్థితుల్లో ఓ…