COVID-19 మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంత నష్టపోయారో మనందరికీ తెలిసిందే..ఈ క్రమంలోనే డిజిటల్ రంగం ప్రజలకు అత్యంత చేరువ కావడంతో వీక్షకులకు వినోదాన్ని అందించేందుకు అనేక ఓటిటి లు డిజిటల్ రంగంలోకి ప్రవేశించాయి. ప్రతి ఒక్కరూ కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఫ్యామిలీ అంతా కలసి చూసేలా వెలసిన అనేక ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు ప్రజలను అలరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సినీ ప్రేక్షకులు కూడా భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే థియేటర్స్ కు వెళుతుండడంతో చిన్న బడ్జెట్ సినిమాలు విడుదలకు నోచుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఓటిటి లో విడుదల చేయడానికి ముందుకు రావడంతో ఇటీవల ఓటీటీలకు బాగా డిమాండ్ పెరుగుతుంది.ఈ నేపథ్యంలో అటువంటి వారికి చేయూత నిచ్చేందుకు ఓటిటి రంగంలో సరికొత్త వినోద విప్లవం ఆవిష్కరించేందుకు సమాయత్త మవుతుంది”డ్యూడ్”(DUDE) ఓటిటి. మే 1 న…
