పూరీ జగన్నాథ్, హీరో రామ్ కాంబినేషన్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా ప్రారంభమైనప్పుడు అందరిలోనూ ఎన్నో అనుమానాలు ఉండేవి. కానీ పూరీ జగన్నాథ్ ఎంతో కసితో ఈ సినిమా తీశాడు. ఫలితంగా అది సూపర్ హిట్ అయ్యింది. పూరీ అప్పులన్నీ తీర్చేసిన సినిమా అది. హీరో రామ్ మార్కెట్ ను కూడా రెండింతలు పెంచిన సినిమా అని చెప్పొచ్చు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఇద్దరూ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ కసితోనే ‘డబుల్ ఇస్మార్ట్’ చేశారు. ‘ఇస్మార్ట్ శంకర్’ కి ఇది సీక్వెల్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్ వంటివి ఇంప్రెస్ చేశాయి. “లైగర్” లాంటి డిజాస్టర్ తర్వాత పూరీ జగన్నాథ్ కి, “స్కంద” లాంటి ఫ్లాప్ తర్వాత రామ్ పోతినేనికి యాసిడ్ టెస్ట్…