స్టార్‌ నటి అనుష్క పెళ్లి ఎప్పుడో తెలుసా..?

Do you know when star actress Anushka will get married?

స్టార్‌ నటి అనుష్క పెళ్లి కుదిరిందా..త్వరలోనే శుభవార్త వెలువడుతుందా.. ఇప్పుడు ఇదే వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. అక్కినేని నాగార్జున నటించిన ‘సూపర్‌’ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌పై మెరిసింది మంగళూరు భామ అనుష్కా శెట్టి. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌ హీరోలతో కలిసి నటిస్తూ వన్‌ ఆఫ్‌ ది లీడింగ్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఓ వైపు గ్లామరస్‌ పాత్రలు చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న రోల్స్‌ చేస్తూ మంచి పేరు సంపాదించింది. ‘అరుంధతి’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన ఈ భామ ‘బాహుబలి’ ప్రాంఛైజీతో గ్లోబల్‌ స్టార్‌ డమ్‌ సంపాదించుకుంది. ‘బాహుబలి’ తర్వాత సినిమాలు తగ్గించిన స్వీటీ మరి పెండ్లి పీటలెక్కేదెప్పుడంటూ సోషల్‌ విూడియాలో చాలాకాలంగా చర్చ నడుస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా దీనికి సంబంధించిన వార్తే నెట్టింట రౌండప్‌…