శ్రీల లిప్‌లాక్‌ సినిమా ఏంటో తెలుసా?

Do you know what Srila Liplock movie is?

శ్రీలీల ఇప్పుడు ఈ పేరు సౌత్‌ ఇండియా అంతటా మారుమ్రోగుతున్నది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది సమయంలోనే టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ దక్కించుకుని తిరుగులేని అధిపత్యాన్ని చెలాయిస్తున్నది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను సినిమాలను లైన్లో పెట్టింది. స్టార్‌ హీరోలు సైతం తన కాల్షీట్ల కోసం వేచి చూసేలా చేస్తు భారీ పారితోషకంతో వరుస ఆఫర్లతో దూసుకెళుతున్నది. శ్రీలీల సినిమాలో ఉంది అంటే దానికి ప్రేక్షకులను క్యూ కట్టేలా చేస్తున్నది. ఈ అమ్మడు దెబ్బకు అప్పడివరకు ఫుల్‌ బీజీగా ఉన్న పూజా హెగ్డే, రష్మిక మందన్న, రాశి ఖన్నాలు వేరే ఇండస్ట్రీల వైపు మళ్లేలా చేసిందంటే శ్రీలీల రేంజ్‌ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.…