నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ భారీ పీరియాడికల్ మూవీ “కెప్టెన్ మిల్లర్”. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టి జి త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్డేట్ తో వచ్చారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న’కెప్టెన్ మిల్లర్’ టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. కెప్టెన్ మిల్లర్’ టీజర్ జూలై 28న విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ధనుష్ గొడ్డలి పట్టుకొని ఫెరోషియస్ గా నడుస్తున్న లుక్ ఇంట్రస్టింగా…