టాలీవుడ్ నుంచి ‘కల్కి’ తర్వాత అత్యధిక అంచనాలతో విడుదలైన పాన్ ఇండియా సినిమా ‘దేవర’. సెప్టెంబరు 27న ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించింది. టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నా.. ఈ చిత్రం ఓపెనింగ్ వీకెండ్లో భారీ వసూళ్లే సాధించింది. ఆ తర్వాత కొంచెం డల్ అయినట్లు కనిపించినా.. దసరా సెలవులను ఉపయోగించుకుని నిలకడగా కలెక్షన్లు రాబట్టింది. ఇంకా కూడా ఈ సినిమా రన్ కొనసాగుతోంది. కాకపోతే ప్రస్తుతం వసూళ్లు నామమాత్రంగా ఉన్నాయి. ఐతే పేరుకు పాన్ ఇండియా సినిమా కానీ ‘దేవర’ మేజర్ వసూళ్లను తెలుగు వెర్షన్ నుంచే రాబట్టింది. 80 శాతం పైగా వసూళ్లు తెలుగు నుంచి వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్‌లో, కర్ణాటకలో తెలుగు వెర్షన్ అదరగొట్టింది. కానీ సౌత్‌లో మిగతా చోట్ల ‘దేవర’ పెద్దగా ప్రభావం చూపలేదు. తమిళ…