పొదుపు, మదుపు.. విషయంలో నాకంటూ కచ్చితమైన కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని నా బ్యాంకు ఖాతాలోని ప్రతి రూపాయీ నా కష్టార్జితం. నా చెమట ఫలం. దాన్ని పాపాయిలా పెంచాలని ఆరాటపడతానని ప్రముఖ బాలీవుడ్ నటీ దీపికా పదుకోనే పేర్కొన్నారు. సరిగ్గా నాలానే ఆలోచించే ఆంత్రప్రెన్యూర్స్ తారసపడితే.. ఆ స్టార్టప్‌లో సంతోషంగా పెట్టుబడి పెడతాను. ఇప్పటి వరకూ నా ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ దేశీ కంపెనీల మీదే పెట్టాను. నేను నటిని కావచ్చు. కానీ జన్మత క్రీడాకారిణిని. జీవితాన్ని ఆటలానే భావిస్తాను. ప్రపంచాన్ని మైదానంలా చూస్తాను. సినిమా బాగా ఆడిన ప్రతిసారీ కప్పు గెలుచుకున్న ఆనందం. ఓటమిని కూడా ఓ క్రీడాకారిణిగా హుందాగానే స్వీకరిస్తాను. ఆటమైదానం జీవితానికి సరిపడా పాఠాలు నేర్పుతుంది. ముఖ్యంగా క్రమశిక్షణ.. నా కంటే బాగా నటించేవాళ్లు చాలామందే ఉండవచ్చు. కానీ, డిసిప్లిన్‌లో ఎవరైనా నా తర్వాతే.…