డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తన తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ టైటిల్ రోల్ పోషిస్తుండటంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో విశ్వక్ సేన్ కనిపించిన ‘దాస్ కా ధమ్కీ’ థియేట్రికల్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫుట్-ట్యాపింగ్ నంబర్ తో సినిమా మ్యూజిక్ ప్రమోషన్ లను ప్రారంభించారు. హిందీ వెర్షన్ ఆల్మోస్ట్ దిల్ కా పథ మిలా పాటని రానా దగ్గుబాటి లాంచ్ చేయగా, తెలుగు వెర్షన్ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల పాటను సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు. లియోన్ జేమ్స్ స్కోర్ చేసిన ట్యూన్ చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంది. పాట కోసం ఫారిన్ లోకేషన్స్ లోషూట్ చేసిన స్టైలిష్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశ్వక్ సేన్ స్టైలిష్…