‘ఆదిపురుష్‌’ పరాజయంతో ఏడ్చేశా : నటి కృతి సనన్‌

Cried after 'Aadipurush' debacle: Actress Kriti Sanon

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘ఆదిపురుష్‌’ బాక్సాఫీస్‌ వద్ద అట్టర్‌ప్లాప్‌గా నిలిచింది. ఇక ప్రభాస్‌ రాధేశ్యామ్‌ తర్వాత మరో డిజాస్టార్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమా పరాజయంపై తాజాగా స్పందించింది నటి కృతి సనన్‌. ఆదిపురుష్‌ ప్లాప్‌ అయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. మనం ప్రాణం పెట్టిన సినిమాలు పరాజయం అయితే తీవ్ర కుంగుబాటుకు లోనవుతాం. కొన్నిసార్లు ఏడ్చేస్తాం. అయితే ఈ తప్పు ఎక్కడ జరిగిందోనని ఆలోచిస్తాం. ఎదుటివారి విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీయడం అనేది మా లక్ష్యం కాదు. ప్రతి ప్రాజెక్ట్‌ వెనుక ఉద్దేశం పాజిటివ్‌గానే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు అది కొందరికి నచ్చకపోవచ్చు. ఏది ఏమైనా ఈ అనుభవాల నుండి మనం చాలా నేర్చుకుంటాం. ఒక నటిగా నేను ఎప్పుడు పాజిటివ్‌గా ముందుకెళ్లాలి.…