చిరంజీవి లండన్ టూర్ .. పైసా వసూల్ ఫ్యాన్ పై ఆగ్రహం

Chiranjeevi's London tour... Paisa Vasool fans angry

లండన్ పార్లమెంట్ లో అంతర్జాతీయ గౌరవం అని వెళ్లిన మెగాస్టార్ చిరంజీవికి ఆవేదన మిగిల్చింది! సహజంగా లండన్ పార్లమెంట్ లో అధికారికంగా ఎవరికైనా అవార్డు ఇవ్వాలంటే కార్యక్రమం బట్టి 2.40 లక్షల నుండి 5 లక్షల వరకు కట్టాల్సి ఉంటుంది. 40 మంది కన్నా ఎక్కువ మంది పాల్గొనడానికి వీలు కుదరదు. పార్లమెంట్ లో చిన్న కాన్ఫరెన్స్ హాల్ కేటాయిస్తారు. ఇద్దరు ఎంపి లు హాజరు కావాల్సి ఉంటుంది! ఆ ఎంపి పేరిట ఆ హాలును కేటాయిస్తారు! చిరంజీవి తీసుకున్న అవార్డు కూడా అలాంటిదే! లండన్ పార్లమెంట్ హౌస్ కు అక్కడి ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు! పద్మవిభూషణ్ చిరంజీవి అభిమానుల పేరిట లండన్ లో స్థిరపడిన కొందరు మిత్రులు పక్కా స్కెచ్ వేశారు. బ్రిడ్జ్ ఇండియా పేరిట కొణిదెల చిరంజీవికి అంతర్జాతీయ గౌరవం ఆశ కల్పించారు.…