యూత్ స్టార్ నితిన్, క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘చెక్’. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈనెల 10 నుండి హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ… “చెక్ టైటిల్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నటుడిగా నితిన్ స్థాయిని పెంచే చిత్రమిది. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చదరంగం నేపథ్యంలో చాలా విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి చంద్, సంపత్ రాజ్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. నవంబర్ 5 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది, దాంతో దాదాపుగా సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది.” అని తెలిపారు. పోసాని కృష్ణ…
Tag: check movie
నితిన్, యేలేటి చిత్ర టైటిల్ ‘చెక్’
నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘చెక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో రకుల్ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘చెక్’ టైటిల్, ప్రీ లుక్ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు. ఈసినిమా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ.. ‘‘చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇది. ఇందులో నితిన్ అద్భుతంగా చేస్తున్నాడు. ఈసినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది’’ అని చెప్పారు. నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ… ‘‘నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లోసినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఎవరు ఎవరికి ఎలా చెక్పెడతారనేది చివరి వరకూ తెలియదు.…