టాలీవుడ్ లో ప్రతిభగల నటుడిగా అజయ్ కి మంచి పేరుంది. విభిన్నమైన చిత్రాల్లో విలక్షణ పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడాయన. తాజాగా అజయ్ ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ‘చక్రవ్యూహం’. ‘ది ట్రాప్’ అనేది ఉపశీర్షిక. చెట్కూరి మధుసూధన్ దర్శకత్వంలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత శ్రీమతి సావిత్రి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం 2, జూన్ 2023న ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిత్రం విడుదలకు ముందే మంచి బజ్ ని క్రియేట్ చేసింది. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ ‘చక్రవ్యూహం” చిత్రం ఫస్ట్ లుక్‌ని స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలిగింది. ఆయన విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకులనుండి అద్భుతమైన…