టాలీవుడ్‌లో అందం అభినయంతో ఆకట్టుకొనే గ్లామర్ హీరోయిన్ లో క్యాథరిన్ త్రెసా ఒకరు.’చమ్మక్ చలో’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి నానితో ‘పైసా’, అల్లు అర్జున్‌తో ‘ఇద్దరు అమ్మాయిలతో’, ‘రుద్రమదేవి’, ‘సరైనోడు’ వంటి చిత్రాల్లో నటించింది. వరుస విజయాలతో దూసుకెళ్లిన క్యాథరిన్ తెరపై కనిపించి చాలాకాలం అవుతుంది. అవకాశాలు తగ్గడంతో సైలెంట్ అయిపోయింది. సోషల్ విూడియాలో కూడా కనిపించడం లేదు. ఇక తాజాగా ఈ అమ్మడు బంపర్ ఆఫర్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో మంచి ఫ్యామిలీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. పూజా కార్యక్రమాలు, ఓపెనింగ్ అయిపోయింది కాబట్టి నేరుగా సెట్స్ లోకి వెళ్ళిపోతారు. ఇక ముందు నుంచి వైరల్ అవుతున్నట్లుగా మెయిన్ హీరోయిన్‌గా నయనతార ఒకే అయిన విషయం తెలిసిందే. ఇక…