శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న బాలల చిత్రం “అభినవ్” (chased padmavyuha). భీమగాని సుధాకర్ గౌడ్ నిర్మాత మరియు దర్శకునిగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్న కుమార్, నిర్మాత దామోదర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని హరిజన, గిరిజన విద్యార్థులను సత్య అనే గంజాయి మాఫియాడాన్ విద్యార్థులతో గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటాడు. బంటి అనే గిరిజన బాలుడు స్మగ్లర్ చేతిలో పావుగా మారి గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటాడు. భారతి అనే…