విజయీభవ ఆర్ట్స్ పతాకంపై నందు విజయ్‌కృష్ణ హీరోగా.. యాంకర్ రష్మి గౌతమ్ హీరోయిన్ గా రాజ్ విరాట్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. ఈ నెల 4 న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా విజయవంతంగా థియేటర్స్ లో ప్రదర్శింపబడుతుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన బోసుబాబు మాట్లాడుతూ.. నందు,విరాట్, రష్మీ లు ఎంచుకొన్న కథకు. సీనియర్ ఆర్టిస్టులను కాకుండా కొత్త ట్యాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చెయ్యాలని ఉద్దేశ్యంతో తీసిన మా సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ…