తిరుమల శ్రీవారి సన్నిధిలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ!

Bollywood beauty Janhvi in ​​the presence of Tirumala Srivari!

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన తల్లి, అతిలోకసుందరి శ్రీదేవి 61వ జయంతి సందర్భంగా.. ప్రతి ఏడాది తిరుపతిని సందర్శించే ఆచారాన్ని అనుసరిస్తూ మంగళవారం ఆమె శ్రీవారి దర్శనం చేసుకున్నారు. గతంలో శ్రీదేవి సైతం తిరుమల శ్రీనివాసుడిపై ఉన్న భక్తితో తన ప్రతి పుట్టిన రోజు నాడు తిరుమలకి వచ్చి దర్శనం చేసుకునేవారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె కుమార్తె జాన్వీ కపూర్‌ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తన మదర్‌ అనే కాకుండా.. తనకు వీలునప్పుడల్లా తిరుపతి ఆలయాన్ని జాన్వీ కపూర్‌ సందర్శిస్తూనే ఉన్నారు. తిరుమల చేరుకున్న జాన్వీ కపూర్‌ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత జాన్వీ కపూర్‌ స్వామివారికి షాష్టాంగ నమస్కారం చేశారు. అచ్చమైన తెలుగమ్మాయిలా పట్టుచీరలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు జాన్వీ. పక్కనే…