తెలుగు ప్రేక్షకులకు… తెలుగు సినిమా బతికున్నంతకాలం… గుర్తుండిపోయే పేరు పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య. హాస్యం ఆయన కేరాఫ్ ఆడ్రస్, హాస్యానికే ప్రాణం పోసిన బ్రహ్మ ఆయన.. అన్ని రసాల్లో హస్యానికి పెద్దపీట వేశారు కాని ఏ పాత్రనైనా అలఓకగా చేసి చూపించిన గొప్ప నటుడు అల్లు రామలింగయ్య. 1000 కి పైగా చిత్రాల్లో నటించి… తెలుగు సినిమా పరిశ్రమకి మార్గదర్శకుడయ్యాడు. ఆయన తెరపై కనిపిస్తే పాత్ర కనిపిస్తుందికాని ఆయన కనిపించరు. నటనకి నిలువెత్తు రూపం అల్లు రామలింగయ్య అంటే అతిశయోక్తికాదు. తెలుగు సినిమా చరిత్రలో గర్వించదగ్గ గొప్ప క్లాసిక్స్ లో అల్లు రామలింగయ్య పాత్రలు వుండటం విశేషం. హోమియోపతి డాక్టర్ గా పలు సేవాకార్యక్రమాలు అందించారు, తరువాత తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా ఎంత బిజీగా వున్నా కూడా తన వృత్తి హోమియోపతిని మాత్రం వదల్లేదు.…