-థియేటర్స్ లో ప్రేక్షకుల నవ్వులు చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది. #సింగిల్ సినిమా ఆడియన్స్ చాలా కాలం ఎంజాయ్ చేస్తూనే వుంటారు: హీరో శ్రీవిష్ణు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ #సింగిల్. కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అందరినీ అలరించి సమ్మర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు.…