రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే

Bhagyashree Borse is the heroine in the movie produced by Maitri Movie Makers under the direction of Mahesh Babu P starring Ram Pothineni as the hero.

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ #RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. గురువారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. హీరోగా రామ్ 22వ సినిమా ఇది. #RAPO22 హీరోయిన్‌గా యంగ్ అండ్ హ్యాపెనింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఎంపిక అయ్యింది. ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యింది. మొదటి సినిమాతో గ్లామర్, యాక్టింగ్ చేయగల నటిగా పేరు తెచ్చుకుంది. రామ్, భాగ్యశ్రీ జంటగా రూపొందుతున్న మొదటి చిత్రమిది. వాళ్ళిద్దరి పెయిర్, సీన్స్ సినిమా హైలైట్స్‌లో ఒకటి అవుతాయని యూనిట్ అంటోంది. ‘మిస్ శెట్టి మిస్టర్  పోలిశెట్టి’లో దర్శకుడు మహేష్ బాబు. పి సున్నితమైన వినోదంతో పాటు…