ముంబై కి చెందిన ప్రముఖ ఫ్యాషన్ రంగ మోడల్.. బెవిలిన్ భరాజ్ తెలుగు సినిమా రంగంలో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి హైదరాబాద్ వచ్చింది. తన క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్ తెలియజేయడానికి ఫిలిం ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఆమె. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు బెవిలిన్ భరాజ్ సమాధానాలు ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ “ఫ్యాషన్ మోడలింగ్ లో అక్కడ నాకు మంచి పేరు, ఒక స్టార్ డం ఉంది. మాది ముంబైలో వ్యాపార కుటుంబం. సోలార్ ఎనర్జీ బిజినెస్ లో ఉన్నాము. “రే ఫోర్స్ గ్రీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్” కంపెనీ నిర్వహిస్తున్నాము. నేను ఈ సంస్థలో డైరెక్టర్ గా పని చేస్తున్నాను. మా సంస్థ సోలార్ ఎనర్జీని తయారు చేస్తుంది. ఫ్యాషన్ మోడలింగ్ లో అడుగుపెట్టి మంచి విజయం…