”అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి ఈ పేరు శానా ఏళ్లు గుర్తుంటాది’ అంటూ టీజర్‌తో విపరీతంగా ఆకట్టుకున్నారు నందమూరి బాలకృష్ణ. ట్రైలర్ అయితే మరో లెవల్ . గత చిత్రాల మాదిరి కాకుండా డిపరెంట్ లుక్, మ్యానరిజంతో కనిపించారు బాలయ్య. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇందులో కాజల్ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడు. అనిల్ కామెడీకి బాలయ్య మాస్ ఎలిమెంట్స్ కలిస్తే థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే. భారీ అంచనాల మధ్య శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఏమనుకుంటున్నారు అన్నది చూద్దాం. ఓవర్సీస్‌లో ప్రీమియర్ చూసిన కొందరు ‘బ్రో ఐ డోంట్ కేర్’… సినిమా సూపర్‌హిట్ అని అభిప్రాయ పడుతున్నారు. ఇది టిపికల్ బాలయ్య స్టైల్ సినిమా కాదు.…