‘బలగం’ అందరూ మెచ్చే సినిమా అవుతుంది : స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

balagam andharoo mechhe cinema avuthundhi

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మిస్తోన్న సినిమా ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ప్రెస్ మీట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ ప్రెస్ మీట్‌లో … స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘నేను నిర్మాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ స్టార్ట్ చేసిన్ప‌పుడు కొత్త‌లో కొత్త ద‌ర్శ‌కుల‌ను, ఆర్టిస్టులును, టెక్నీషియ‌న్స్‌ని ఇంట్ర‌డ్యూస్ చేశాం. త‌ర్వాత ఏమైందంటే ఎదుగుతున్న క్ర‌మంలో రాజుగారి ద‌గ్గ‌రికి వెళితే పెద్ద సినిమాలే చేస్తారు, ఇలాగే ఉంటారంటూ వార్త‌లు వ‌చ్చి కొత్త కాన్సెప్ట్ సినిమాల‌కు బ్రేక్ వ‌స్తుంది. మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా ఉండాల‌నే ఉద్దేశంతోనే మా నెక్ట్స్ జ‌న‌రేష‌న్ సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు. అందులో భాగంగానే దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ స్టార్ట్…