సంపూర్ణేశ్ బాబుతో ‘హృదయకాలేయం’ సినిమాతో రైటర్‌గా, నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్నాడు టాలీవుడ్ డైరెక్టర్ సాయిరాజేశ్ . ఈ ఏడాది ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కించిన ‘బేబి’ సినిమాతో డైరెక్టర్‌గా సూపర్ బ్రేక్ అందుకున్నాడు. ఈ చిత్రం నిర్మాత ఎస్‌కేఎన్ కు కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడీ క్రేజీ కాంబోలో మరో సినిమా రాబోతుంది. సాయిరాజేశ్, ఎస్‌కేఎన్ కాంబోలో ప్రొడక్షన్ నంబర్ 4గా వస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాకు మరోసారి రైటర్ కమ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతున్నాడు సాయిరాజేశ్. సంతోష్ శోభన్, అలేఖ్య హారిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో నిర్వహించారు. అక్కినేని నాగచైతన్య ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. యూట్యూబర్‌గా సూపర్ ఫేమస్ అయిన అలేఖ్య హారిక ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.…