ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’ (అవతార్ 2) చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. పదమూడేళ్ల తర్వాత ‘అవతార్’కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ ని క్రియేట్ చేశాయి. ఒక సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఏళ్ల తరబడి ఎదురుచూశారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ చిత్రమే ‘అవతార్ 2’. ఈ చిత్రానికి సంబంధించిన మొదటిభాగం 2009లో వచ్చి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. ప్రతీ సన్నివేశం ప్రేక్షకుడిని ఊపిరాడకుండా చేసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించి రికార్డుల్ని చించేసింది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ విజన్ కు ఉన్న శక్తి ఏపాటిదో ప్రేక్షకుల కళ్ళకు కట్టింది. ఒకటా..రెండా.. ఎన్నని చెప్పుకుందాం.. ఈ…