సంచలనాలకు తెర లేపబోతున్న ‘ధర్మచక్రం’ మూవీ చంద్రన్న చరిత్ర స్ఫూర్తితో SIFAA సంస్థ నిర్మాణం తెలుగు రాజకీయ, సినీ రంగాల్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోన్న చిత్రం ‘ధర్మచక్రం’. ఈ సినిమాను నిస్వార్థ సేవా దృక్పథంతో స్థాపితమైన SIFAA సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థను స్థాపించిన వ్యక్తి, గత ముప్పై ఏళ్లుగా సొంత ఖర్చులతో, ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ధర్మచక్రం’ సినిమా షూటింగ్ పూర్తయినట్లు SIFAA సంస్థ ప్రకటించింది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ.. ‘ధర్మచక్రం’ సినిమా చంద్రబాబు నాయుడు గారుఎంతో కష్టపడి, పార్టీ విలువలను కాపాడిన జీవన గాథకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ సినిమా ద్వారా” నోటు రుచి మరిగిన వారికి…