బాలకృష్ణ గారి డెడికేషన్ కి హ్యాట్సప్. ‘భగవంత్ కేసరి’ ప్రతి తెలుగు కుటుంబం చూసే లాంగ్ రన్ మూవీ: నిర్మాత దిల్ రాజు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది బాలకృష్ణ గారి ద్వారా చెప్పించడం గొప్ప దేశసేవ: డైరెక్టర్ నందిని రెడ్డి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని దసరా విన్నర్ గా నిలిచింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంసలు అందుకొని అఖండ విజయం సాధించింది. ‘భగవంత్ కేసరి’…