‘మురారి’ లాంటి సినిమా చేయాల‌నుంది : అశోక్ గ‌ల్లా

ashok galla interview

మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడే అశోక్ గ‌ల్లా. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త కూడా అయిన జ‌య‌దేవ్ ఇంటి నుంచి అమ‌ర్‌ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థ నుంచి వ‌చ్చిన సినిమా `హీరో`. అశోక్ గ‌ల్లా క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. కౌబాయ్ నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమాతో అశోక్ గ‌ల్లాకు న‌టుడిగా మంచి గుర్తింపు వ‌చ్చింది. ఈ సినిమా థియేట‌ర్‌ లోనూ ఓటీటీలోనూ విడుద‌లై న‌టుడిగా త‌న‌కెంతో సంతృప్తినిచ్చింద‌ని అశోక్ గ‌ల్లా తెలియిజేస్తున్నారు. ఓటీటీలో వ‌స్తున్న అభినంద‌న‌లు కొత్త ఉత్సాహానిచ్చాయ‌ని తెలియ‌జేస్తూ, తాను చేయ‌బోయే కొత్త సినిమా జూన్‌ లో వెల్ల‌డిస్తాన‌ని పేర్కొన్నారు. ఆయ‌న పుట్టిన‌రోజు (5 ఏప్రిల్) ఈ సంద‌ర్భంగా అశోక్ గ‌ల్లా తో జ‌రిపిన ఇంట‌ర్వ్యూ విశేషాలు. * కొత్త గెట‌ప్‌ లో క‌నిపిస్తున్నారు. ఏదైనా కొత్త…