నాగ్ సర్ అందరికీ ఫ్రీడమ్ ఇస్తారు: మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్

Anuprubens Music Director

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు . అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుద‌ల‌కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మీడియాతో ముచ్చటించారు. అవి అయన మాటల్లోనే… ”నాగ్ సర్ అందరికీ ఫ్రీడమ్ ఇస్తారు. మా కాంబినేషన్‌లో మంచి మ్యూజిక్ రావడానికి అది ఒక కారణం. నేను ఆయనకు లక్కీనా? ఆయన నాకు లక్కీనా? అని ఎప్పుడూ ఆలోచించలేదు. లక్ అనేది దేవుడి దయ. ఆయన టెక్నికల్ టీంకు ఫ్రీడం ఎక్కువగా ఇస్తారు. ప్రతీ సినిమాకు ఒకేలా కష్టపడతాం. కానీ హీరోలు, డైరెక్టర్లతో ఉన్న ర్యాపో వల్ల…