ఆనంద్‌ దేవరకొండ చిత్రం ‘గం..గం..గణేశా’

Anand Devarakonda's film 'Gam..Gam..Ganesha'

‘దొరసాని’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ‘మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌’, ‘పుష్పకవిమానం’ సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్‌ దేవరకొండ. ఇక ఈ ఏడాది ‘బేబి’ సినిమాతో సూపర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ యంగ్‌ హీరో నటిస్తోన్న కొత్త చిత్రం ‘గం..గం..గణేశా’ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హైలైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్‌ శెట్టి ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను డిజిటల్‌గా సమంత లాంఛ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫస్ట్‌ లుక్‌ లాంఛ్‌ ఈవెంట్‌కు సంబంధించి మేకర్స్‌ మరో అప్‌డేట్‌ ఇచ్చారు. కొంపల్లిలోని రాయచందాని మాల్‌ లో ఈ ఫస్ట్‌ లుక్‌ లాంఛ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్న ట్లు మేకర్స్‌ సోషల్‌ మీడియాలో…