తన కామెడి సీన్స్ తో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నాడు అభినవ్ గోమటం. తనకంటూ కామెడి పరంగా ఒక యునిక్ బేస్ ని ఈ నగరానికి ఏమైంది సినిమా ద్వారా క్రియేట్ చేసుకున్నాడు, ఆ తరువాత మీకు మాత్రం చెప్తాను సినిమాలో కూడా తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు, OTT లో రిలీజ్ అయిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో కూడా తన సత్తాను చాటుకున్నాడు.. ప్రస్తుతం మస్తు షేర్స్ ఉన్నాయ్ రా అనే రొమాంటిక్ కామెడీ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోగా రానున్నాడు, ఈ చిత్రంలోని మొదటి పాట ఈరోజు రిలీజ్ అయింది.. హలో అమ్మాయి అనే ఈ పాటలో మెలడీతో పాటు సాహిత్యం కూడా అద్భుతంగా ఉంది. ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ లిరిక్స్ రాశారు.. టి సంజీవ్ అద్భుతమైన…