4kలో ఆల్-టైమ్ ఫాంటసీ క్లాసిక్ ‘భైరవద్వీపం’

All-time fantasy classic 'Bhairavadweepam' in 4k

వైవిధ్యమైన కథలను స్వాగతించే నటసింహ నందమూరి బాలకృష్ణ 1993లో తెలుగు సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే అద్భుతాన్ని సృష్టించేందుకు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుతో కలిసి పనిచేశారు. ఒక ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించి, ప్రేక్షకులను అందులోకి తీసుకువెళ్లిన ‘భైరవద్వీపం’ చిత్రం 14 ఏప్రిల్ 1994న విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందిస్తూ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలను సృష్టించింది. క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్ ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ని ఈ తరం ప్రేక్షకుల కోసం ఆగస్ట్ 5, 2023న అప్‌గ్రేడ్ చేసిన 4K క్వాలిటీతో రీ రిలీజ్ చేస్తోంది. చంద్ర శేఖర్ కుమారస్వామి, క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్‌ పి.దేవ్ వర్మ ‘భైరవ ద్వీపం’ 4కె విడుదలతో ప్రేక్షకులకు అత్యుత్తమ సినిమాటిక్ అనుభూతిని అందిస్తున్నారు. ఈ చిత్రంలో నటసింహ నందమూరి బాలకృష్ణ ఒక తెగలో ఎదుగుతున్న రాకుమారుడు విజయ్‌ గా…