* గిల్డ్ సభ్యులు చెప్పెవన్నీ అబద్దాలే… ఆదివారం ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరగనున్నాయి. చిత్ర పరిశ్రమలో ఛాంబర్ లో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒకరికొకరు సహకరించుకుని ముందుకు వెళ్లాలి అని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఫిలిం ఛాంబర్ ఎన్నికలు డిసెంబర్ 28న జరుగుతున్న సందర్భంగా మన బ్యానర్ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా చదలవాడ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమ అదుపు తప్పింది. గిల్డ్ అని పెట్టి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. 20 రోజుల పాటు కార్మికులకు, ఎలాంటి రెస్పాన్స్ రోజుల తరబడి ఇవ్వకుండా తిప్పించారు. నిజానికి గిల్డ్ సభ్యులే చిత్రీకరణలు ఆపారు. వారు స్వార్దం గా వ్యవహరించారు. ఛాంబర్ సభ్యుల పేరిట సిఎంలతో ఫోటోలు దిగాలనే ఆలోచన తప్ప, చిత్ర పరిశ్రమ బాగు…
