నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవిందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతుండటంతో చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమా గురించి చాలా వేదికలపై మాట్లాడాను. నిన్ననే ఓ డిస్ట్రిబ్యూషన్ ఫోన్ చేశారు. బాలయ్య గారి సినిమా అంటే సంక్రాంతి వస్తుంది. ఇంకో నాలుగు రోజులు ఉంచుతారా? సర్.. యాభై రోజులు పూర్తి అవుతంది అన్నారు. గత కొన్నేళ్లుగా ఇలా డిసెంబర్‌లో విడుదలై సంక్రాంతి వరకు కొన్ని వందల థియేటర్లలో నడుస్తున్నది కేవలం అఖండ మాత్రమే.…